Share News

MLA: టీడీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:27 PM

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసే సామర్థ్యం ఒక్క టీడీపీతోనే సాధ్య మని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రగతి పండుగ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం గుంతకల్లు ఎ మ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలిసి మండలంలోని గలగల గ్రామం లో పర్యటించారు.

MLA:  టీడీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం
MLA distributing pass books to farmers

-ఎమ్మెల్యే కాలవ

గుమ్మఘట్ట, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసే సామర్థ్యం ఒక్క టీడీపీతోనే సాధ్య మని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రగతి పండుగ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం గుంతకల్లు ఎ మ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలిసి మండలంలోని గలగల గ్రామం లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ. 24 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీరోడ్డును, రూ. 2 లక్షలతో నిర్మించిన క్యాటిల్‌షెడ్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామం లో 99 మందికి ఇళ్లపట్టాలు, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పం పిణీ చేశారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లో మండలంలో రూ. 5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత టీడీపీదే అన్నారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడు తూ రాషా్ట్రన్ని అభివృద్ధి బాటలో నడిపించేది ఒక్క టీడీపీనే అన్నారు. వ చ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరా రు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన హనుమంతరెడ్డి, తహసీ ల్దార్‌ రజాక్‌వలి, ఎంపీడీవో జయరాము లు, వైస్‌ చైర్మన దానవేంద్ర, టీడీపీ మండల కన్వీనర్‌ కాలవ సన్నన్న, మాజీ కన్వీనర్‌ గిరిమల్లప్ప, నాయకులు లోకేష్‌, రాజు, సంజీవ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 12 , 2026 | 11:27 PM