MLA: సమస్యలను వేగంగా పరిష్కరిస్తాం
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:17 AM
ప్రజాదర్బారులో ఇచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణం లోని టీడీపీ కార్యాలయం లో శనివారం ఉదయం ప్రజాదర్బాను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి విన్నవిం చారు.
-ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
గుంతకల్లు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ప్రజాదర్బారులో ఇచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణం లోని టీడీపీ కార్యాలయం లో శనివారం ఉదయం ప్రజాదర్బాను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి విన్నవిం చారు. మాజీ కౌన్సిలరు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఒకటో వార్డుకు చెందిన వారు ఎస్‌ఎన పేట వద్ద నుంచి కిలోమీటరు మేర కసాపురం రోడ్డు అఽ ద్వానంగా మారిందని, బాగుచేయించాలని విన్నవించారు. తన భార్య పుష్పలతకు కిడ్నీ బదలాయింపు కోసం ఆర్థిక సాయం కావాలని గత ప్రజాదర్బారులో కోరగా, ఎమ్మెల్యే రూ. 3.70 లక్షల సీఎంఆర్‌ఎఫ్ నిధు లను మంజూరు చేయించారని పట్టణానికి చెందిన తిరుమల యాదవ్ ఎమ్మెల్యేని సన్మానించారు.
దివ్యాంగులకు ఇళ్లను మంజూరు చేయాలని దివ్యాంగుల హక్కుల సాధన సమితి అధ్యక్షురాలు పద్మ ఎమ్మెల్యేకి వి న్నవించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆమ్లెట్ మస్తాన యా దవ్, గుమ్మనూరు వెంకటేశులు, బండారు రామన్న చౌదరి, గుణశేఖర్, ఫజులు, మెహరున్నిసా బేగం, ఫ్రూట్ మస్తాన, ఆటో ఖాజా, యుగం ధర్, రాయల్ వెంకటేశులు, వీరేశ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
’సర్’లో చురుగ్గా పాల్గొన్న వారికి గుర్తింపు
ఓటరు జాబితా ప్రత్యేక సమరణ ప్రక్రియ(సర్)లో చురుగ్గా పనిచే సిన టీడీపీ వార్డు ఇన్చార్జ్‌లు, బీఎల్యేలు తదుపరి ఎన్నికల్లో గుర్తింపుని స్తామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం బీఎల్‌ఓలు, ఎన్నికల సూ పర్‌వైజర్లు, పార్టీకి చెందిన బీఎల్‌ఏలు, వార్డు ఇన్చార్జ్‌ల సమావేశాన్ని నిర్వహించారు. సర్ ప్రక్రియను వివరించి, ప్రజల్లో ఉన్న భయాలను తొలగించాలని సూచించారు. కార్యక్రమం వేగంగా పూర్తయ్యేలా కృషిచే యాలని తెలిపారు. అనంతరం సాయంత్రం ఆయన పట్టణంలో బీసీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని పరిశీ లించారు. మైనార్టీ స్కూల్ కాంప్లెక్స్‌లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసే విషయంగా కలెక్టరుతో చర్చించారు. గురుకుల పాఠశాలకు సొంత భవనం ఏర్పాటయ్యేంత వరకూ మైనార్టీ స్కూల్ కాంప్లెక్స్‌లో నిర్వహిం చేందుకు ప్రతిపాదిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....