Share News

JCPR: తిరుణాలను వైభవంగా నిర్వహిస్తాం : జేసీపీఆర్‌

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:03 AM

మండలంలోని తిమ్మన చెరువు లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఈనెల 30న అంగ రంగ వైభవంగా తిరుణాలను నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం దేవస్థానాన్ని పరిశీలించి అర్చకులు, ఆలయ కమిటీ వారితో మాట్లాడారు. తిరుణాల ప్రత్యేకంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని తెలిపారు.

JCPR: తిరుణాలను వైభవంగా నిర్వహిస్తాం : జేసీపీఆర్‌
Former MLA JCPR examining the arrangements of Tirunala

పెద్దపప్పూరు, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని తిమ్మన చెరువు లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఈనెల 30న అంగ రంగ వైభవంగా తిరుణాలను నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం దేవస్థానాన్ని పరిశీలించి అర్చకులు, ఆలయ కమిటీ వారితో మాట్లాడారు. తిరుణాల ప్రత్యేకంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట టీడీపీ సీనియర్‌ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, బీసీ రామకృ ష్ణారెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శశిధర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 28 , 2026 | 12:03 AM