Share News

MLA: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:03 AM

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గన్నె వారిపల్లికాలనీలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

MLA: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం
MLA JC Ashmita Reddy inaugurating TDP office

- ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి

తాడిపత్రి, మార్చి31(ఆంధ్రజ్యోతి): ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గన్నె వారిపల్లికాలనీలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ గత ఐదేళ్ల పాలనలో తమకు ఎన్నో ఇబ్బందులు ఎదు రైనా చెక్కుచెదరకుండా కార్యకర్తలు అండగా ఉన్నారన్నారు. 40ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా తనను ఆదరించి అత్యధిక మెజా ర్టీతో గెలిపించిన తాడిపత్రి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా మన్నారు. సౌమ్యుడైన చింబిలి వెంకటరమణను ఎప్పుడు మరిచిపో వద్దని ప్రజలకు సూచించారు. అంతకుమనుపు అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనం తరం గన్నెవారిపల్లి పంచాయతీ వార్డు సభ్యులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీ రవీంద్రా రెడ్డి, ప్రసాద్‌నాయుడు, యుగందర్‌, విజయబార్‌ బాబు, రాము, చింబిలి రవి, చింబిలి రాజా, రమేష్‌, రాంమోహననాయుడు, హరినాథ్‌రెడ్డి, సంజీవపురం పవన, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 01 , 2026 | 12:04 AM