Water సాసర్ పిట్‌లకు నీరు
ABN , Publish Date - May 22 , 2026 | 12:06 AM
వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చడం కోసం అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో ఉన్న సా సర్ పిట్‌లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
మడకశిర రూరల్, మే 21 (ఆంధ్రజ్యోతి): వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చడం కోసం అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో ఉన్న సా సర్ పిట్‌లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
అటవీ శాఖ బీట్ ఆఫీసర్ దివా కర్ మాట్లడుతూ వేస విలో తాగునీటి కోసం వన్యప్రాణులు సమీప గ్రామాల్లోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాటి దాహార్తిని తీర్చడం కోసం అటవీ ప్రాంతంలో ఉన్న సాసర్ పిట్‌లను ట్యాంకర్ల ద్వారా నీటితో నింపుతున్నట్లు చెప్పారు. వర్షాలు పడేవరకు 15 రోజులకోసారి సాసర్ పిట్‌లను నీటితో నింపనున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..