Share News

WASTE: చెత్త నుంచి సంపద శూన్యం

ABN , Publish Date - May 03 , 2026 | 11:13 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చుస్తున్న చెత్త నుంచి సంపద కార్యక్రమాన్ని మండ లంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్‌ తయారు చేయాలన్న లక్ష్యం అమలు కాకపోవడంతో రూ. కోట్లతో నిర్మించిన కేంద్రాలు ఖాళీగా మారాయి.

WASTE: చెత్త నుంచి సంపద శూన్యం
Govindawada Village is a useless wealth-making center

- 19 పంచాయతీల్లో 15 సెంటర్లు నిరుపయోగం

బొమ్మనహాళ్‌, మే 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చుస్తున్న చెత్త నుంచి సంపద కార్యక్రమాన్ని మండ లంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్‌ తయారు చేయాలన్న లక్ష్యం అమలు కాకపోవడంతో రూ. కోట్లతో నిర్మించిన కేంద్రాలు ఖాళీగా మారాయి. మండలంలోని 19 పం చాయతీల్లో 17 సాలిడ్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లను నిర్మించారు. వీటిలో 15 పూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయి. ఎక్కడా చెత్త వేరు చేసే ప్రక్రియ జరగడం లేదు. కంపోస్టు తయారీ లేదు. గత టీడీపీ ప్ర భుత్వ హయాంలో చెత్తతో సంపద సృష్టించాలనే లక్ష్యంతో ఈ సెంట ర్లను నిర్మించారు. వాటిలో చెత్త నుంచి కంపోస్టు తయారు చేసే క్రమంలో 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ కేంద్రాలను నిరు పయోగంగా వదిలేశారు. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వ ఏర్పడిన తరువాత తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్టు తయారు చే యాలని సంకల్పించింది. అయితే పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంగా కారణంగా ఆ కేంద్రాలను నిరుపయోగంగా ఉంచుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గోవిందవాడ వంటి పెద్ద పంచాయతీల్లో రూ. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన డంపింగ్‌ యార్డ్‌, షెడ్లు వినియోగంలో లేక పోవడంతో వెలవెలబోతున్నాయి.


చెత్త సేకరణ వ్యవస్థ లేకపోవడంతో అవి అలంకార ప్రాయంగా మారాయి. గత టీడీపీ ప్రభుత్వ హయంలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన షెడ్లు ఉపయోగంలో లేక పాడై పోతున్నాయి. అప్పుడప్పుడు మరమ్మ తుల పేరుతో వేలాది రూపాయ లు ఖర్చు చేస్తుండటం తప్ప లక్ష్యానికి సంబంధించిన పనితీరు కనిపించడం లేదు. మండలంలోని ఉంతకల్లు గ్రామంలో మాత్రమే వర్మీ కంపోస్ట్‌ తయారు చేసి రైతులకు అందిస్తు న్నారు. మిగతా గ్రామాల్లో ఈ పథకం పూర్తిగా విఫలమైంది. పంచా యతీ కార్యదర్శులు శ్రద్ధ పెట్టక పోవడం, ఉన్నతాఽధికారులు పర్యవేక్షణ లేకపోవడంపై షెడ్ల నిర్వహణ లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చెత్తతో సంపద తయారీకి చర్యలు తీసుకుంటాం

-వెంకటరమణ, డీప్యూటీ ఎంపీడీవో, బొమ్మనహాళ్‌

మండలంలోని అన్ని పంచాయతీల్లో తడి, పొడి చెత్తతో వర్మీకం పోస్టు తయారీకి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉంతకల్లు, శ్రీధరఘ ట్ట గ్రామాల్లో మాత్రమే వర్మీ కంపోస్టు తయారు అవుతోంది. ఉద్ధేహాళ్‌ గ్రామంలో షెడ్డు లేకపోవడం వల్ల స్థలం కోసం తహసీల్దార్‌ను సంప్ర దించాం. స్థలం మంజూరైతే షెడ్డు నిర్మిణానికి చర్యలు తీసుకుంటాం. ఉప్పరహాళ్‌ గ్రామంలో షెడ్డు నిర్మాణంలో ఉంది. ఇంకా పూర్తి కాలేదు. నిరుపయోగంగా ఉన్న కేంద్రాల్లో చెత్త నుంచి సంపద ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 03 , 2026 | 11:13 PM