Share News

WASTE: తాగునీటి వృథా

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:43 PM

ఒకవైపు వేసవిలో దా హంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరోవైపు దాదాపు 15 రోజులుగా కళ్లెదుటే తాగునీరు వృథా అవుతున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. మండలంలోని కలుదేవనహాళ్లి సమీపంలోని వేదావతి హగరి కాజువేపై పైపులైన లీకేజీతో నీరు రో డ్డుపై పారుతూ... అధికార యంత్రాంగం నిర్లక్ష్య్యానికి నిదర్శనంగా నిలు స్తోంది.

WASTE: తాగునీటి వృథా
Waste water flowing over the causeway at Kaludevanahalli

- పైప్‌లైన లీకేజీతో కాజ్‌వేపై ప్రవహిస్తున్న నీరు

- 15 రోజులవుతున్నా పట్టించుకోని అధికారులు

- వెంటనే మరమ్మతులు చేయాలంటున్న గ్రామస్థులు

బొమ్మనహాళ్‌, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ఒకవైపు వేసవిలో దా హంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరోవైపు దాదాపు 15 రోజులుగా కళ్లెదుటే తాగునీరు వృథా అవుతున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. మండలంలోని కలుదేవనహాళ్లి సమీపంలోని వేదావతి హగరి కాజువేపై పైపులైన లీకేజీతో నీరు రో డ్డుపై పారుతూ... అధికార యంత్రాంగం నిర్లక్ష్య్యానికి నిదర్శనంగా నిలు స్తోంది. గ్రామ సమీపంలో కాజువేపై ఉన్న పైపులైన దెబ్బతినడంతో ని రంతరం నీరు లీక్‌ అవుతూ రోడ్డుపైకి చేరుతోంది. దీంతో రహదారి మొ త్తం నీటితో నిండిపోగా వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రయా ణించాల్సి వస్తోంది. నీరు నిల్వ ఉండటం వల్ల కాజువే రోడ్డు కూడా దె బ్బతింటోంది. ఇదే సమయంలో గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండటం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తోంది.


ఒకవైపు తాము నీటికోసం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు విలువైన తాగునీ రు ఇలా వృథా అవుతోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం ఇదే గ్రామంలో తాగునీటి ట్యాంకు వద్ద పైపులైన లీకేజీపై ‘నీటి వృథాకు ప్లాస్టిక్‌ సంచితో చెక్‌’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి దిని పత్రికలో వార్త వెలువడిన విషయం విదితమే. దీనిపై అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు. అయితే ఇప్పుడు అదే గ్రామంలో మళ్లీ లీకేజీ సమస్య తలెత్తినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అధికారులు వెంటనే స్పందించి పైపులైన లీకేజీని సరిచేసి నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 28 , 2026 | 11:43 PM