Share News

LINK: లింక్‌రోడ్డు కోసం నిరీక్షణ

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:43 PM

స్థానిక రైల్వేస్టేషనకు వెళ్లేందుకు సమీపంలోనే ఉన్న లింక్‌రోడ్డును పూర్తిగా ఆచరణలోకి తీసు కురావాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల తరబడిగా దీని కోసం నిరీక్షిస్తు న్నారు. ముఖ్యంగా పట్టణంలోని ఓబుళాచారిరోడ్డు నుంచి రైల్వేస్టేషన చాలా దగ్గర గా ఉంటుంది.

LINK: లింక్‌రోడ్డు కోసం నిరీక్షణ
The road leading to the railway station

రాయదుర్గం, జూన 10(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వేస్టేషనకు వెళ్లేందుకు సమీపంలోనే ఉన్న లింక్‌రోడ్డును పూర్తిగా ఆచరణలోకి తీసు కురావాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల తరబడిగా దీని కోసం నిరీక్షిస్తు న్నారు. ముఖ్యంగా పట్టణంలోని ఓబుళాచారిరోడ్డు నుంచి రైల్వేస్టేషన చాలా దగ్గర గా ఉంటుంది. అయితే అక్కడ రైల్వే శాఖ వారి క్వార్టర్లు ఉండడంతో ఈ రోడ్డును పూర్తిగా మూసేశారు. కానీ రాయదుర్గం పట్ట ణంలో నివాసం ఉండే సగం జనాభాకు ఈ రోడ్డు చాలా సమీపంలో ఉంటుంది. అయితే రైల్వేశాఖ ఈ రోడ్డుపై రాకపోకలు సాగించ కుండా మూసేస్తూ వస్తోంది. ముఖ్యంగా రైల్వేస్టేషనకు బళ్లారి రోడ్డు నుంచి ఓబుళాచారిరోడ్డు, నేసేపేటతో పాటు శాంతినగర్‌ ప్రాంతాల వాసులకు అనుకూలమైన రహదారి. ఈ దారి వెంట వెళితే అరకిలోమీటరుకు పైగా ఆదా అవుతుంది. కానీ రైల్వేశాఖ అనుమతి లేకపో వడంతో చుట్లూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైల్వేశాఖ ఆధీనంలో ఉన్న 20 మీటర్ల పొడవు ఉన్న స్థలాన్ని రహదారిగా మార్చి మున్సిపల్‌ రోడ్డుగా అభివృద్ధి చేస్తే ప్రజలకు సౌకర్య వంతంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు దీనిపై రైల్వే శాఖకు విన్నవిస్తూ వస్తున్నప్పటికీ ఎలాంటి అనుమతులు రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు లింక్‌రోడ్డును అభివృద్ధి చేస్తే రైల్వే స్టేషనకు వేళ్లేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 10 , 2026 | 11:43 PM