Share News

GOD: ఐరావతంపై సంగమేశ్వరుడి విహారం

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:11 AM

మండలకేంద్రంలో జరుగుతు న్న జోడులింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ వారం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఐరావత వాహనంపై పార్వతీ పరమేశ్వరులను ఊరేగించారు. ఉదయం ఆలయంలో రుద్రా భిషేకం చేశారు.

GOD: ఐరావతంపై సంగమేశ్వరుడి విహారం
Parameshwari Parvati in procession on Airavata vehicle

కూడేరు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో జరుగుతు న్న జోడులింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ వారం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఐరావత వాహనంపై పార్వతీ పరమేశ్వరులను ఊరేగించారు. ఉదయం ఆలయంలో రుద్రా భిషేకం చేశారు. రాత్రి స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో గ్రామంలోకి తీసకొచ్చారు. ఐరావత వాహనాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి, విద్యుత ద్వీపాలతో ముస్తాబుచేశారు. అందు లో ఉత్సవ విగ్రహాలను ఉంచి గ్రామంలో ఊరేగించారు. ఈ వేడుకల ను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

నేడు రథోత్సవం

కూడేరు : జోడు లింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మడు గుతేరు, సాయంత్రం రథో త్సవం నిర్వహిస్తారు.. ఇం దుకు అవసరమైన ఏర్పాట్లు బుధవారం నుంచి ప్రారంభ మయ్యాయి. వేదపండితు లతో వేకువ జామున ఆల యంలో రుద్రాభిషేకం, గ ణపతి, నవగ్రహ, మృత్యం జయహోమాలు నిర్వహి స్తారని ఈఓ రమేష్‌బాబు తెలిపారు. ఉదయం 6 గం టల నుంచి 7 గంటల లో గా మడుగుతేరు లాగుతా రన్నారు. సాయంత్రం నిర్వ హించే రథోత్సవానికి భక్తు లు పెద్ద ఎత్తున తరలి వ స్తారని, అవసరమైన ఏర్పా ట్లు చేశామన్నారు. ఉత్స వాల సందర్భంగా సీఐ రా జు పరిశీలించారు.

Updated Date - Apr 02 , 2026 | 12:11 AM