Share News

TDP: అన్ని పంచాయతీల్లో విజయం సాధించాలి

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:59 PM

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ నేత పయ్యావుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని మంత్రి కే శవ్‌ క్యాంపు కార్యాలయంలో కూడేరు మండలంలోని కూడేరు, ఇప్పే రు క్లస్టర్ల పరిధిలోని నాయకులు, బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు.

TDP:  అన్ని పంచాయతీల్లో విజయం సాధించాలి
Payyavula Srinivasulu speaking with leaders.

- టీడీపీ నేత పయ్యావుల శ్రీనివాసులు

కూడేరు, జూన 15(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ నేత పయ్యావుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని మంత్రి కే శవ్‌ క్యాంపు కార్యాలయంలో కూడేరు మండలంలోని కూడేరు, ఇప్పే రు క్లస్టర్ల పరిధిలోని నాయకులు, బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు. గ్రామాల్లో టీడీపీ బలంగా ఉందని, నాయకులు, కార్యకర్తలు పార్టీ వి జయమే బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఓటర్ల మ్యాపింగ్‌ (సర్‌) జరుగుతోందని, నాయకులు, బూత కన్వీనర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, మాజీ ఎంపీపీ బ్రహ్మయ్య క్లస్టర్‌ ఇనచార్జ్‌లు అరవకూరు ప్రసాద్‌, ఎంఎంహళ్లి రాజప్ప తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 15 , 2026 | 11:59 PM