MLA: వేమన జయంతిని ఘనంగా నిర్వహిస్తాం
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:50 PM
యోగి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గురువారం తెలిపారు. మండల పరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మె ల్యే యోగివేమన ఆలయానికి వచ్చారు.
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
గాండ్లపెంట, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): యోగి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గురువారం తెలిపారు. మండల పరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మె ల్యే యోగివేమన ఆలయానికి వచ్చారు. యోగి వేమన ఆలయ పూజా రులు, గ్రామ పెద్దలు, రెవెన్యూ అధికారులతో ఉత్సవాలపై చర్చించారు. వేమన జయంతి ఉత్సవాలను అధికారికంగా జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వేమన జయంతి రోజున ఆలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ పెద్దలు, పీఠాధిపతి నంద వేమారెడ్డితో చర్చించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబూరావు, టీడీపీ మండల కన్వీనర్ వెంకటప్రసాద్, దాసిరెడ్డి, ఆనంద, నరసింహులు, హేమంతరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....