WATER: నిరుపయోగంగా నీటి తొట్టెలు
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:39 PM
పల్లెపండుగ 2025-26 లో భాగంగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మూగజీవుల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం నీటితొట్టె లు ఏర్పాటుచేసింది. ఒక్కొక్క తొట్టె నిర్మాణానికి సుమారు రూ.40వేలు మేర ఖ ర్చుచేసింది
- పశువుల దాహార్తి తీరేదెలా? : పశువుల యజమానులు
పెద్దపప్పూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): పల్లెపండుగ 2025-26 లో భాగంగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మూగజీవుల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం నీటితొట్టె లు ఏర్పాటుచేసింది. ఒక్కొక్క తొట్టె నిర్మాణానికి సుమారు రూ.40వేలు మేర ఖ ర్చుచేసింది. గత ఏడాది మండలంలోని గార్లదిన్నె, నరసాపురం, చీమలవాగుపల్లి, పెద్దపప్పూరు, వరదాయపల్లిలో వాటి నిర్మాణం పూర్తయిం ది. ఇప్పటికే మండలపరిధిలో ఇంకొన్ని నీటి తొట్టెలు ఉన్నాయి. అయితే వీటి పర్యవేక్షణ మర్చిపోవడంతో ప్రభత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.
నీరు నింపేది ఎవరు
పశువులు నీరు తాగేందుకు అనుకూలంగా ఐదుమీటర్ల పొడవు, రెండుమీటర్ల వెడల్పు, మీటర్ లోతుతో నీటి తొట్టెలు నిర్మించారు. ఆవు లు, గేదెలు, మేకలు, గొర్రెలు నీరు తాగేందుకు అనుకూలంగా నీటి నిర్మాణాలు పూర్తిచేశారు. గ్రామాల్లో చేతిపంపులు, పంచాయతీ కొళాయిలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్న ప్రదేశాల్లో వీటిని నిర్మించాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఈ తొట్టెలలో ఎప్పటికప్పుడు నీటి ని నింపడం, మరమ్మతులు తదితరాల విషయాలను పర్యవేక్షించాలనే నిబంధన ఎందుకు మరిచిపోయారో అంటూ పాడి రైతులు, పశు పెంపకం దారులు ఎద్దేవా చేస్తున్నారు. అందుకే వాటి బాగోగులను అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని మాట్లాడుకుంటున్నా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలో బీటలు వారిన నీటి తొట్టెలకు మరమ్మత్తులు చేయించి, ఎండల కాలంలో మూగజీవాలు దాహార్తి తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పరిశీలించి వినియోగంలోకి తెస్తాం- రత్నాబాయి, ఎంపీడీవో
నూతనంగా ఏర్పాటుచేసిన నీటితొట్టెల్లో కొన్ని ఉపయోగంలో ఉన్నాయి. మరికొన్ని వివిధ సమస్యల వల్ల ఉపయోగంలో లేవు. వెంటనే వాటిని పరిశీలించి ఉపయోగంలోకి తీసుకొస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....