CHC: నిరుపయోగంగా...
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:57 PM
పట్టణంలోని సీహెచసీలో కమ్యూనిటీ మరుగుదొడ్లు, 108 వాహనం పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి. రోగులు ఇబ్బందు లు పడకూడదన్న ఉద్దేశ్యంతో గతంలో స్వచ్ఛ భారత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ మరుగుదొడ్లు పూర్తి అధ్వాన స్థితికి చేరుకుని, వృథాగా పడి ఉన్నాయి.
-సీహెచసీలో మరుగుదొడ్లు, 108 వాహనం
కళ్యాణదుర్గం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సీహెచసీలో కమ్యూనిటీ మరుగుదొడ్లు, 108 వాహనం పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి. రోగులు ఇబ్బందు లు పడకూడదన్న ఉద్దేశ్యంతో గతంలో స్వచ్ఛ భారత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ మరుగుదొడ్లు పూర్తి అధ్వాన స్థితికి చేరుకుని, వృథాగా పడి ఉన్నాయి. దీంతో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇదే సీహెచసీలో 108 వాహనం మరమ్మ తులకు నోచుకోక ముళ్లకంపల మధ్య వృథాగా దర్శనమిస్తోంది. కానీ వాటి వైపు కన్నెత్తి చూసే వారే కరువయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాటికి మరమ్మతులు చేయాలని రోగులు, ప్రజలు కోరుతున్నారు
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....