Share News

VHC: ఆరోగ్య కేంద్రం వద్ద అపరిశుభ్రత

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:11 AM

ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ పరిస రాలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. సాయంత్రం వేళ కొందరు మద్యం తాగి క్లినిక్‌ సమీపంలోనే పడుకుంటున్నారని, మద్యం సీసాలు, గ్లాసులను అక్కడే పడేస్తున్నారని స్థానికులు అంటున్నారు.

VHC: ఆరోగ్య కేంద్రం వద్ద అపరిశుభ్రత
Tetra packs lying near the village health clinic in Kaduluru.

డి. హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌), సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ పరిస రాలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. సాయంత్రం వేళ కొందరు మద్యం తాగి క్లినిక్‌ సమీపంలోనే పడుకుంటున్నారని, మద్యం సీసాలు, గ్లాసులను అక్కడే పడేస్తున్నారని స్థానికులు అంటున్నారు. డి. హీరేహాళ్‌ మండలం లోని కదులూరులోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ వద్ద కొందరు అకతాయిలు మద్యం తాగి మద్యం సీసాలు, గ్లాస్‌లు అక్కడే పడేస్తున్నారు. దీంతో పరిసరాల అపరి శుభ్రంగా మారుతున్నాయి. సిబ్బంది ప్రతి రోజు పరిసర ప్రంతాల్లో పడి ఉన్న వాటిని శుభ్రం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌తో పాటు సమీపంలోని గ్రామ సచివాలయం పరిసరాల్లోనూ సాయంత్రం వేళ మద్యం తాగుతున్నారని గ్రామ స్థులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాల యాలు, వైద్య కేంద్రాల వద్దే మద్యం తాగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని కట్టడి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. కర్ణాటక మద్యం విక్రయాలపై సంబంధిత అధికా రులు నిఘా పెట్టి, అక్రమ విక్రయాలు జరుగుతున్నాయో లేదో తనిఖీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 21 , 2026 | 12:11 AM