SCHOOL: అసంపూర్తి భవనాలు
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:59 PM
వేసవి సెలవుల అనంతరం మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చాలా చోట్ల పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు కనిపిం చడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదని విమర్శలు ఉన్నాయి.
- విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని తిప్పలు
ఉరవకొండ, జూన 9(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల అనంతరం మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చాలా చోట్ల పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు కనిపిం చడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదని విమర్శలు ఉన్నాయి. నాడు - నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చుతామని వైసీపీ పాలకులు అప్పట్లో ప్రగల్బాలు పలికారు. ఆ మేరకు పనులు ప్రారంభించినా సకా లంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రా క్టర్లు చేతులె త్తేశారు. మొదటి, రెండో విడతల్లో డిజిటల్ గ్రంఽథాలయాలు, అదనపు తరగతి గదులు,
మరుగుదొడ్లు, ప్రహరీలు, మినరల్ వాటర్ పాంట్లు, ఏ ర్పాటు చేస్త్తామని చెప్పారు. నేటికీ అదనపు తరగతి గదులు అసంపూర్తి గానే దర్శనమిస్తునాయి. నాడు- నేడు పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగి పోయాయి.
-వజ్రకరూరు మండలంలో 24 పాఠశాలలు, ఉరవకొండ మండ లంలో 53 పాఠశాలల్లో రెండో విడత పనులు చేపట్టారు. వజ్రకరూరు మండలంలోని పంది కుంట పాఠశాలలో 207మంది దాకా విద్యార్థులు ఉన్నారు. అక్కడ అర్ధాంతరంగా నిలిచిపోయిన గదులలోనే గత విద్యా సంవత్సరం తరగతులు నిర్వహించారు. భవనాలు పూర్తి కాకపోవడంతో ఈ సంవత్సరం అదే పరిస్థితి. ఆ పాఠశాలలో ఆరు గదులు మాత్రమే ఉన్నాయి. మరికొన్ని తరగతులను వరండాలో నిర్వహించాల్సిన దుస్థితి ఉంది. ఉరవకొండ మండలంలోని బూదగవి, మోపిడి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలోనూ తరగతి గదుల కొరత ఉంది. మూడేళ్లుగా నా డు- నేడు పనులు నిలిచిపోయాయి. బూదగవిలో ఆర్‌ఎంఎస్‌ఏ కింద నిర్మించిన ల్యాబ్‌ల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. 124మంది దాకా వి ద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న రెండు మరుగుదొడ్లనే ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడుకోవాల్సి ఉంది. ఆ రెండు పాఠశాలల్లో నూ మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. ఈ విషయంపై వజ్ర కరూరు ఎంఈవోను వివరణ కోరగా నాడు- నేడు కింద నిలిచిపోయిన పాఠశాల వివరాలను ప్రభుత్వానికి పంపామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....