GARBAGE: అపరిశుభ్రంగా..
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:36 PM
పట్టణంలోని కూరగా యల మార్కెట్‌లో చెత్త పేరుకుపోయి దుర్వాసనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. కూరగాయల మార్కెట్‌లో పబ్లిక్ టాయిలెట్ల పక్కన ఖాళీ స్థలంలో మున్సిపల్ శానిటేషన సిబ్బంది డస్ట్ బినలు ఏ ర్పాటు చే శారు.
- కూరగాయాల మార్కెట్‌లో పేరుకు పోయిన చెత్తా చెదారం
గుంతకల్లుటౌన, మార్చి 5(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కూరగా యల మార్కెట్‌లో చెత్త పేరుకుపోయి దుర్వాసనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. కూరగాయల మార్కెట్‌లో పబ్లిక్ టాయిలెట్ల పక్కన ఖాళీ స్థలంలో మున్సిపల్ శానిటేషన సిబ్బంది డస్ట్ బినలు ఏ ర్పాటు చే శారు. కూరగాయల మార్కెట్‌లోని వ్యాపారాలు తమ వ్యర్థాల న్నింటినీ తెచ్చి డస్ట్ బినలో వేయకుండా కిందపడేస్తున్నారు. అందులో ఆవుులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా చెత్తచె దారంతో దర్శనమిస్తోంది. మున్సిపల్ సిబ్బంది మూడు, నాలుగు రోజు లైనా చెత్తను తొలగించడం లేదు. ఆ స్థలం మాత్ర విజర్జనకు నిల యంగా మారింది. పలువురు వ్యాపారులు మున్సిపల్ కాంప్లెక్స్‌లలో గోదాములుగా వాడటంతో మూసి ఉన్న దుకాణాల ముందర మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధ భరితంగా మా రిపోయింది. దుర్వాసనతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా ము న్సిపల్ అధికారులు స్పందించి చెత్తను రోజూ తీసుకెళ్లేలా చర్యలు తీసు కుని, దుర్వాసన నుంచి మిముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....