Share News

CDPO: నవచేతనపై శిక్షణ

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:59 PM

పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్ల పిల్లలు వరకూ వచ్చే వైకల్యాలను, లోపాలను, అభివృద్ధి ఆలస్యాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీడీపీవో బీఎన శ్రీదేవి, విడపనకల్లు తహసీల్దారు డీ వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు.

CDPO: నవచేతనపై శిక్షణ
CDPO BN Sridevi speaking in Vidapanakallu

విడపనకల్లు, జూన 6(ఆంధ్రజ్యోతి): పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్ల పిల్లలు వరకూ వచ్చే వైకల్యాలను, లోపాలను, అభివృద్ధి ఆలస్యాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీడీపీవో బీఎన శ్రీదేవి, విడపనకల్లు తహసీల్దారు డీ వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. మండలకేం ద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో అంగనవాడీ కార్యకర్తలకు రెండు రోజుల పాటు నిర్వహించే నవచేతనపై ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. వైద్యాధికారి పుష్ప, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్లు పుష్పావతి, విజయకుమారి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

- అదేవిధంగా గుంతకల్లుపట్టణంలోని సరోజినినాయుడు మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం నవచేతనపై అంగనవాడీ కార్య కర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీడీపీవో ఎల్లమ్మ హాజరై శిక్షణ ఇచ్చారు. పుట్లూరు జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అన్నపూర్ణదేవి, వైద్యాధికారి శ్రీవాణి హాజరై శిక్షణ ఇచ్చా రు. బ్రహ్మసముద్రం జిల్లా పరిషత పాఠశాలలో సీడీపీవో నాగమణి ఆఽ ద్వర్యంలో మండల పరిధిలోని అంగనవాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...

Updated Date - Jun 06 , 2026 | 11:59 PM