TRAFFIC: వాహనదారులకు ట్రాఫిక్ సమస్య
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:25 PM
మండల కేంద్రంలోని కదిరి - రాయచోటి ప్రధాన రహదారిలో ద్విచక్రవాహనాలు, ఆటోలను ఎక్కడప డితే అక్కడ నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతు న్నాయని ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు తెలుపుతున్నారు. కదిరి - రాయచోటి ప్రధాన రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది.
గాండ్లపెంట, జనవరి 14(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కదిరి - రాయచోటి ప్రధాన రహదారిలో ద్విచక్రవాహనాలు, ఆటోలను ఎక్కడప డితే అక్కడ నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతు న్నాయని ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు తెలుపుతున్నారు. కదిరి - రాయచోటి ప్రధాన రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అయితే ఆటోలు, ద్విచక్ర వాహనాలను రోడ్డుపై నిలపడంతో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ముందుకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుందని ప్రజలు వాపోతున్నారు. నాలుగురోడ్ల కూడలిలో మల్లమీదపల్లి వైపు, జీన్లకుంట వైపు వెళ్ళే ప్రధాన రహదారులలో నిత్యం ఆటోలు, చిరువ్యాపారులు తోపుడు బం డ్లను ఉంచడంతో వాహనదా రులు, ప్రయాణికులు ముందుక వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. ట్రాఫిక్ సమస్యను పోలీసులు నివారించక పోవడంతో ఈ సమస్యలు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....