Share News

CRIME: అవినీతి అధికారుల్లో గుబులు

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:58 PM

మండలంలో ఏసీబీ దాడులపై హాట్‌ టాపిక్‌ నడుస్తోంది. ఏసీబీ దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొ దలైంది. రెండేళ్ల వ్యవధిలో ఏసీబీ అధికారులు పామిడిలో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధానంగా కీలకమైన తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయాలపై దృష్టిసారించడం చర్చనీయాంశమైంది.

CRIME: అవినీతి అధికారుల్లో గుబులు

- ఏసీబీ దాడులతో వణుకు

పామిడి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మండలంలో ఏసీబీ దాడులపై హాట్‌ టాపిక్‌ నడుస్తోంది. ఏసీబీ దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొ దలైంది. రెండేళ్ల వ్యవధిలో ఏసీబీ అధికారులు పామిడిలో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధానంగా కీలకమైన తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయాలపై దృష్టిసారించడం చర్చనీయాంశమైంది. మండలంలో ఇరవై ఏళ్ల క్రితమూ, 2024, 2026 సంవత్సరాలలోనూ ఏసీబీ దాడులు జరిగాయి. ఇటీవల సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడంతో హాట్‌ టాపిక్‌గా మారింది.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు

పట్టణంలోని మండల పరిషత, తహసీల్దార్‌, సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలలో పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గతంలో ఇరవై ఏళ్ల క్రితం అప్పటి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనాయక్‌ ఓ అభివృద్ధి పనికి బిల్లు మంజూరు కోసం డబ్బులు తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. అలాగే బిల్లుల మంజూరు కోసం డబ్బులు తీసుకుంటూ ఈఓగా పనిచేస్తున్న విజయభాస్కర్‌ నాయుడు, మరుగుదొడ్ల అవకతవకలకు పాల్పడుతూ శానిటరీ ఇనస్పెక్టర్‌ కరీముల్లా, పొలం కొలతలకు డబ్బు డిమాండ్‌ చేసి సర్వేయర్‌ బాషా ఏసీబీకి చిక్కినట్లు మండల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.


అలాగే 2024 ఫిబ్రవరి 27న తహసీల్దార్‌ కార్యాలయంలో రెండు భూమి బదలాయింపులకు(మ్యూటేషన్లు) డబ్బు తీసుకుంటూ రెవెన్యూ ఇనస్పెక్టర్‌ క్రాంతి కుమార్‌, ఈ నెల 5న ఇంటి రిజిస్ట్రేషనకు అసిస్టెంట్‌ ద్వారా డబ్బులు తీసుకున్నందున సబ్‌ రిజిసా్ట్రర్‌ రాధ రమణ ఏసీబీకి చిక్కారంటూ ఎక్కడ చూసినా ఇదే చర్చ.

ఏసీబీ దాడులతో వణుకు

మండలంలోని పలు శాఖల్లోని అక్రమార్కుల గుండెల్లో ఏసీబీ వణు కు పుట్టిస్తోంది. దీంతో కొంతమంది అధికారులు కార్యాలయాల్లో సీట్లలో కూర్చోకుండా క్యాంపుల పేరుతో వెళుతున్నారు. వసూల్‌ రాజాలు కాస్త వెనక్కు తగ్గారు. లంచం తీసుకుంటూ పలువురు పట్టుబడటం అంత టా చర్చనీయాంశం కావడంతో వారిలో భయం పట్టుకుంది. రెవెన్యూ, సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో పట్టుబడడంతో మిగిలిన శాఖల్లోనూ ఏ సీబీ ఫీవర్‌ పట్టుకుంది. కార్యాలయాల్లో అనుమానస్పదంగా ఎవరు సం చరించినా వాకబు చేస్తున్నారు. ఎవరెవరు ఏ పనిపై వచ్చారో తరచూ అడుగుతున్నారు. తమ శాఖలో, కార్యాలయాల్లో అలాంటిదేమీ ఉం డ దంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడు ఏ కార్యాలయంపై దాడులు జరుగుతాయోనని భయబ్రాంతులకు గురవుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 07 , 2026 | 11:58 PM