JCPR: టీబీసీ, హెచ్చెల్సీ పనులు నాణ్యంగా ఉండాలి
ABN , Publish Date - May 20 , 2026 | 11:53 PM
టీబీసీ, హెచ్చె ల్సీ సౌతకెనాల్ పనులు నాణ్యంగా చేపట్టాలని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కాంట్రాక్టర్లను కోరారు. ఆయన ఆదివారం పట్టణంలోని తమ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెచ్చెల్సీకి ఇంతవరకు ఇంత మొత్తంలో నిధులు మంజూరు చే యలేదన్నారు.
మాజీ ఎమ్మెల్యే జేసీపీఆర్
తాడిపత్రి, మే20(ఆంధ్రజ్యోతి): టీబీసీ, హెచ్చె ల్సీ సౌతకెనాల్ పనులు నాణ్యంగా చేపట్టాలని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కాంట్రాక్టర్లను కోరారు. ఆయన ఆదివారం పట్టణంలోని తమ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెచ్చెల్సీకి ఇంతవరకు ఇంత మొత్తంలో నిధులు మంజూరు చే యలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దయాదా క్షిణ్యాలతో ఇంత పెద్దమొత్తం నిధులు రావడం ఎంతో శుభపరిణామమన్నారు. ఈ నిధుల కోసం మన ఎమ్మె ల్యే జేసీ అశ్మితరెడ్డి చేసిన పోరాటం ఫలించిందన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి టీబీసీలో కొంతభాగం పూడిక తొలగించి రైతులకు మేలు చేశారన్నారు. అందువల్ల ఈ ఏడాది ఏప్రిల్ వరకు నీరు వచ్చాయన్నారు. పుట్లూరు, యల్లనూరు మండలా ల్లో నీటి సమస్యకు
ఆ కాలువలో ఉన్న పూడిక కారణమని రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి నీటిపారుదలశాఖ మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఈ విషయాన్ని వారువురు కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించడంతో పూడికతీతకు రూ. 1.10 కోట్లు, షట్టర్లు తదితర మర మ్మతులకు రూ. 5. 20కోట్లు నిధులు మంజూరయ్యా యని హర్షం వ్యక్తంచేశారు. మొత్తం రూ. 6.30కోట్లు నిధులు మంజూరు కావడం ఎం తో సంతోషమన్నారు. వాటిని కాంట్రాక్టర్లు సద్వినియోగం చేసి, ఎక్కడా అవినీతి లే కుండా రైతులకు న్యాయం చే యాలన్నారు. కాంట్రాక్టర్లు ఎవరో తమకు తెలియదు కానీ తమ రైతులకు అవినీతి అన్యాయం చేయవద్దని సూచించారు. నాణ్యత లేని పనులు చేసినట్లయితే తమ రైతులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేక దృ ష్టి పెట్టాలన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. అలాగే కాలువల పనులపై యల్లనూరు, పుట్లూరు మండలాలకు చెందిన రైతుల పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....