Share News

KABADDI: కబడ్డీ పోటీల విజేత బెంగళూరు జట్టు

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:55 PM

మండలకేంద్రంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. సీనియర్స్‌ విభాగంలో మొత్తం 20జట్లు పాల్గొనగా, బెంగళూరుకు చెందిన సెవెనస్టార్స్‌ హరీష్‌ జట్టు మొదటి బహుమతి రూ.50వేలు కైవసం చేసుకుంది.

KABADDI: కబడ్డీ పోటీల విజేత బెంగళూరు జట్టు
Organizers presenting the prize to the winning team

యాడికి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. సీనియర్స్‌ విభాగంలో మొత్తం 20జట్లు పాల్గొనగా, బెంగళూరుకు చెందిన సెవెనస్టార్స్‌ హరీష్‌ జట్టు మొదటి బహుమతి రూ.50వేలు కైవసం చేసుకుంది. నంద్యాల జిల్లా ప్యాపిలి జట్టు రెండవ బహుమతి రూ.40వేలను కైవసం చేసుకుంది. చెన్నైకి చెందిన వెంకటన్న జట్టు మూడో బహుమతి రూ.30వేలు కైవసం చేసుకుంది. యాడికి చెందిన ప్రశాంత జట్టు నాలుగవ బహుమతి రూ.20వేలు గెలుచుకుంది. విజేత జట్లకు నిర్వాహకులు నగదు బహుమతులతోపాటు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో కబడ్డీ పోటీల నిర్వాహకులు, బహుమతుల దాతలు, పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 25 , 2026 | 11:55 PM