Share News

MLA: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:43 PM

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం ఖరీఫ్‌ - 2026 రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సాలురెడ్డి ప్రారంభించారు.

MLA: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
MLA Amilineni speaking at the event.

- విత్తన పంపిణీ ప్రారంభంలో ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం రూరల్‌, జూన 15 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం ఖరీఫ్‌ - 2026 రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సాలురెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. వే రుశగనతో పాటు కంది, చిరుధాన్యాలను రాయితీ ద్వారా అందిస్తోం దన్నారు. త్వరలో రైతులకు ట్రాక్టర్లు, డ్రిప్‌ పరికరాలు, స్ర్పింక్లర్లు అంది స్తామన్నారు. ఈ నెల 20న పీఎం కిసాన - అన్నదాత సుఖీభవ సా యం రైతుల ఖాతాల్లో జమ చేస్తారన్నారు. ఈ యేడాది ఎల్‌నినో ప్ర భావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని ఇప్పటికే శాస్త్రవే త్తలు తెలిపిన నేపథ్యంలో చిరుధాన్యాలు సాగు చేయడం మంచిదన్నా రు. కుందుర్పి మండలం జంబుగుంపల వద్ద సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మాణానికి ప్రతిపాదించామని తెలిపారు. 2019 - 2024 మధ్య వైసీ పీ ప్రభుత్వం రాషా్ట్రన్ని దివాళాతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు ఛైర్మన గోళ్ల లక్ష్మీదేవి, వైస్‌ చైర్మన కోనంకి రాజశేఖర్‌, టీడీపీ నాయకులు చౌళం మల్లికార్జున, కర్లకుంట రామాంజినేయులు, మార్కెట్‌ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 15 , 2026 | 11:43 PM