TDP: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:03 AM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుత్తి మార్కెయార్డు చైర్మన ప్రతాప్, ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన శీనా పేర్కొన్నారు. మండలంలోని టి. కొత్తపల్లిలో సోమవారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పథకం సొమ్ము జమపై పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గుత్తిరూరల్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుత్తి మార్కెయార్డు చైర్మన ప్రతాప్, ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన శీనా పేర్కొన్నారు. మండలంలోని టి. కొత్తపల్లిలో సోమవారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పథకం సొమ్ము జమపై పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో రైతులకు అన్నదాత సుఖీభవ పత్రాలను అందజేశారు.టీడీపీ పట్టణ, మండల కన్వీనర్ల్ ఏంకే చౌదరి, లక్ష్మీరంగయ్య, సర్పంచు లింగమయ్య, డీలర్, అంజినప్ప, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
డీ. హీరేహాళ్(బొమ్మనహాళ్): మార్కెట్‌యార్డు చైర్మన హను మంతరెడ్డి, టీడీపీ నాయకులు సోమవారం మండలంలోని పుల కుర్తి గ్రామంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన పథకం మూడో విడత కింద నగదు జమపై టీడీపీ మండల కన్వీనర్ మోహనరెడ్డి ఆధ్య ర్యంలో పరిశీలించారు. ఇంటీంటికి వెళ్లి రైతులను అడిగి తెలుసు కున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మొండి మల్లికార్జున, నాయకులు మంజు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
కణేకల్లు: అన్నదాత సుఖీభవ సొమ్మును అందించి రాష్ట్ర ప్రభు త్వం రైతుల కళ్లల్లో నూతన ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించిందని టీడీపీ మండల కన్వీనర్ వన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం మండలంలోని నల్లంపల్లిలో అన్నదాత సుఖీభవ సొమ్ము ఖాతాలో జమ అయిన రైతులతో మాట్లాడారు. అలాగే సాంకేతిక కారణాలతో జమ కాని రైతులకు త్వరలోనే అందుతుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఏఓ జగదీష్, వీఆర్వో భీమప్ప, టీడీపీ నాయకులు వెంకటే శులు, లక్ష్మీరెడ్డి, గొల్ల వెంకటేశులు, నగేష్, గొల్ల రవి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....