Share News

MLA: రైతు క్షేమంతోనే రాష్ట్రం అభివృద్ధి

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:17 AM

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మండలంలోని వంకరాజుకాలువ గ్రామానికి రూ.1.90కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

MLA: రైతు క్షేమంతోనే రాష్ట్రం అభివృద్ధి
MLA distributing groundnut seed pods to farmers.

- ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

పామిడి, జూన 16(ఆంధ్రజ్యోతి): రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మండలంలోని వంకరాజుకాలువ గ్రామానికి రూ.1.90కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుందని, ఈ రెండేళ్లలో నియోజకవర్గంలో ఎన్నడూ చేయలేని అభివృద్ధి పనులను చేసి చూపామన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించిన నాయకులకే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన సర్‌పై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఐక్యమత్యంతో పోరాడి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.


అనంతరం ప్రభుత్వం రాయుతీపై అందిస్తున్న వేరుశనగ, కంది విత్తనా లను రైతులకు పంపిణీ చేశారు.

రోడ్లు వేశాకే ఓటు అడుగుతా

మండలంలోని అప్పాజిపేట, నెమళ్లపల్లికి రోడ్లు వేశాకే స్థానిక ఎన్నికల్లో ఓటు అడుగుతానని ఆయన శపథం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా రైతులు ఈ క్రాప్‌ బుకింగ్‌ చేసుకోవాలని, ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న ట్రాక్టర్‌లు, వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వంకరాజుకాలువ ఎస్సీ కాలనీలో తాగునీటి ఎద్దడిని మహిళలు ఎమ్మె ల్యే దృష్టికి తీసుకెళ్లగా, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వంకరాజుకాలువ వద్ద పెన్నానది నుంచి ఇసుక తరలింపును అరికట్టాలని సీఐ శివశంకర్‌ నాయక్‌ను ఆదేశించారు. అనంతరం అంగనవాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులకు చాక్లెట్ల కోసం నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇనఛార్జి గుమ్మనూరు ఈశ్వర్‌, ఏడీఏ వెంకటరాముడు, ఎంపీడీఓ తేజోత్స్న, ఏఓ విజయ్‌ కుమార్‌, డిప్యూటీ ఎంపీడీఓ అశ్వర్థమనాయుడు, ఆర్‌ఐ గాయత్రి, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 17 , 2026 | 12:17 AM