Share News

SERVER: పది రోజులుగా సర్వర్‌ బిజీ

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:53 PM

ఆనలైన సర్వర్‌ సరిగా పనిచేయకపోవడంతో స్థానిక మునిసిపాలిటీలో పన్నును చెల్లించ డానికి వచ్చిన స్థానిక ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉండా ల్సి వచ్చింది. రాయితీపై పన్ను చెల్లించడానికి గురువారం ఉదయం పదిన్నరకే పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు వచ్చిన పన్ను చెల్లిం పుదారులు క్యూలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేచి చూశారు.

SERVER: పది రోజులుగా సర్వర్‌ బిజీ
Tax payers waiting as the server is busy

గుంతకల్లు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఆనలైన సర్వర్‌ సరిగా పనిచేయకపోవడంతో స్థానిక మునిసిపాలిటీలో పన్నును చెల్లించ డానికి వచ్చిన స్థానిక ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉండా ల్సి వచ్చింది. రాయితీపై పన్ను చెల్లించడానికి గురువారం ఉదయం పదిన్నరకే పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు వచ్చిన పన్ను చెల్లిం పుదారులో క్యూలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేచి చూశారు. పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని తెలి యడంతో నిరాశతో వెళ్లిపోయారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆనలైన పోర్టల్‌లో మార్పులు, చేర్పుల కారణంగా ఈ సమస్య తలెత్తిందని మునిసిపల్‌ రెవెన్యూ శాఖాధికారులు తెలియజేశారు. త్వరలో సర్వర్‌ సమస్య తొలగిపోతుందన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 09 , 2026 | 11:53 PM