MLA: దోచుకుని దాచుకోవడమే వైసీపీ పాలన
ABN , Publish Date - May 03 , 2026 | 12:12 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలన అంతా ఆ పార్టీ నాయకులు దోచుకుని, దాచుకున్నారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు విమర్శించారు. కంబదూరు మండల పరిఽధిలోని మేళ్లకుంట క్రాస్ నుంచి ఐపార్శపల్లి వరకు రూ. 3కోట్లతో చేపట్టిన సుమారు ఎనిమిది కిలోమీటర్ల తారు రోడ్డు పనులను ఎమ్మెల్యే శనివా రం ప్రారంభించారు.
- ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శ
కళ్యాణదుర్గం, మే 2(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలన అంతా ఆ పార్టీ నాయకులు దోచుకుని, దాచుకున్నారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు విమర్శించారు. కంబదూరు మండల పరిఽధిలోని మేళ్లకుంట క్రాస్ నుంచి ఐపార్శపల్లి వరకు రూ. 3కోట్లతో చేపట్టిన సుమారు ఎనిమిది కిలోమీటర్ల తారు రోడ్డు పనులను ఎమ్మెల్యే శనివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి ఐపార్శపల్లికి రోడ్డు లేకపోవడంతో గ్రామస్థులు ఎన్నోసార్లు అప్పటి ప్రజా ప్రతినిధులను, అధికారులను అడిగినా ఎవరూ పట్టించు కోలేదన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్ర బాబు, ఉప ముఖ్య మంత్రి పవన కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను మంజూరు చేస్తున్నార న్నారు. అందులో భాగంగానే ఆ గ్రామస్థుల 20 ఏళ్ల కళను తాము నెరవేరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో ఇక్కడ ప్రానిధ్యం వహించిన అప్పటి మంత్రి ఉషశ్రీచరణ్ ఐదేళ్లలో దోపిడీ తప్ప, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ, నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....