MLA: మున్సిపాల్టీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:43 PM
స్థానిక మున్సిపాల్టీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పే ర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని స్వగ్రామంలో కళ్యాణదుర్గం మున్సిపాల్టీ పరిధిలోని టీడీపీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్ ఇనచార్జ్ లు, బూత ఇనఛార్జ్‌లకు సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- ఎమ్మెల్యే అమిలినేని
కళ్యాణదుర్గం, జూన 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపాల్టీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పే ర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని స్వగ్రామంలో కళ్యాణదుర్గం మున్సిపాల్టీ పరిధిలోని టీడీపీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్ ఇనచార్జ్ లు, బూత ఇనఛార్జ్‌లకు సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించాలని వారికి సూచించారు. ఇం టింటికీ వెళ్లి 18 ఏళ్లు నిండిన కుటుంబసభ్యుల పేర్లన్నీ ఓటర్ల జాబి తాలో ఉన్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ముఖ్యంగా దొంగ ఓట్లపై నిఘా వుంచి వాటిని తొలగించేలా చూడాలన్నారు. బీఎల్వోలతో సమన్వయం చేసుకుని ఓటర్ల జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని అన్నారు. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేసేందుకు ప్రతి ఒక్క రు కృషి చేయాలన్నారు. గ్రామగ్రామాన టీడీపీ విజయమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్ర మం లో టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....