ROAD: మురుగులోనే బడి దారి
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:49 PM
సార్... నిత్యం ప్రవహించే ఈ మురుగునీటిలో నడిచేదెలా? ఇక్కడ మురుగునీరు ప్రవహించకుండా చే యండని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు. మండల పరిధిలోని కరిగానపల్లి జిల్లా పరిషత పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు పారుతోంది.
కుందుర్పి, జూన 24(ఆంధ్రజ్యోతి): సార్... నిత్యం ప్రవహించే ఈ మురుగునీటిలో నడిచేదెలా? ఇక్కడ మురుగునీరు ప్రవహించకుండా చే యండని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు. మండల పరిధిలోని కరిగానపల్లి జిల్లా పరిషత పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు పారుతోంది. అంతేగాకుండా ఆ నీరు పాఠశాల ఆవ రణలో కి చేరుతోంది. దీంతో విద్యార్థులు రోజూ ఆ మురుగునీరులో నడుచుకుం టూ పాఠశాలలోకి, తరగతి గదుల్లో వెళ్లాల్సి వస్తోంది. విద్యా ర్థుల ఇబ్బం దులు అర్థం చేసుకోరా గ్రామస్థులు అధికారులను ప్రశ్నిస్తు న్నారు. అలా గే పాఠశాల ఆవరణలో మురుగునీరు చేరడం వల్ల దోమల కు ఆవాసం గా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై ము రుగునీరు ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....