GOD: ఘనంగా అక్కదేవతల నెల పూజ
ABN , Publish Date - May 19 , 2026 | 12:04 AM
మండల పరిధిలోని తిమ్మా పురం గ్రామంలో అక్క దేవతల నెల పూజను ఘనంగా నిర్వహించారు. నెల రోజుల క్రితం తిమ్మాపురంలోని ఆలయం నుంచి కరుట్లపల్లి ఆలయానికి అక్కదేవతల గిరిగలను తెచ్చి మూడు రోజు లు పరుష నిర్వహించారు.
కూడేరు, మే 18 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని తిమ్మా పురం గ్రామంలో అక్క దేవతల నెల పూజను ఘనంగా నిర్వహించారు. నెల రోజుల క్రితం తిమ్మాపురంలోని ఆలయం నుంచి కరుట్లపల్లి ఆలయానికి అక్కదేవతల గిరిగలను తెచ్చి మూడు రోజు లు పరుష నిర్వహించారు. వాటిని తిరిగి తిమ్మాపురం ఆలయానికి చేర్చారు. ఆనవాయితీ ప్రకారం సోమవారం తిమ్మాపు రం ఆలయం లో నెల పూజలు నిర్వహించారు. అన్నదానం చేపట్టారు.
గంగాభవానీ ఆలయ హుండీ లెక్కింపు
తాడిపత్రి: మండలంలోని గంగాదేవిపల్లి సమీపంలోని గంగాభవానీ ఆలయం హుండీని సోమవారం లెక్కిం చారు. రెండునెలల పదిరోజులకు గాను ఆదాయం రూ.2,80,555 వచ్చినట్లు ఈఓ రామాంజనేయులు తెలిపారు. అలాగే పాత ఇనుప సామానులను విక్రయించగా, 175కేజీలకు రూ.3500 ఆదాయం వచ్చింది. పర్యవేక్షణ అధికారి సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ చైర్మన రామ సుబ్బారెడ్డి, గ్రామపెద్దలు జయరాంరెడ్డి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....