CPI: ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:14 AM
మండలపరిధి లోని కదిరి - హిందూపురం ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతు లు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాన రోడ్డుపై మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.
సీపీఐ నాయకుల డిమాండ్ - మోకాళ్లపై నిరసన
ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మండలపరిధి లోని కదిరి - హిందూపురం ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతు లు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాన రోడ్డుపై మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూల శ్రీని వాసులు, మండల కార్యదర్శి చలపతి నాయుడు మాట్లాడుతూ... క దిరి - హిందూపురం ప్రధాన రహదారి గుంతల మయం అవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అన్ని విషయాలు అధికారులు తెలిసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారి డిమాండ్. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయా కార్యాలయాల్లో ఎంపీడీవో శివరాం ప్రసాద్ రెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....