LORRY: డివైడర్‌ను ఢీ కొన్న లారీ
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:46 PM
మండలంలోని పా తకొత్తచెరువు గ్రామ సమీపంలో మంగళవారం ఓ లారీ డీవైడర్‌ను ఢీ కొని రోడ్డుపైనే నిలిచిపోయింది. బీఆర్ 24, జీడీ 2986 అనే 14 చక్రాల లారీ గుత్తి వైపు నుంచి బళ్లారికి వెళ్తోంది. మద్యం మత్తులో ఉన్న లా రీ డ్రైవర్‌గుత్తి సమీపంలో ముందు వెళ్తున్న షిప్ట్ డీజైర్ వాహనానికి త గలించాడు.
గుంతకల్లు టౌన, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని పా తకొత్తచెరువు గ్రామ సమీపంలో మంగళవారం ఓ లారీ డీవైడర్‌ను ఢీ కొని రోడ్డుపైనే నిలిచిపోయింది. బీఆర్ 24, జీడీ 2986 అనే 14 చక్రాల లారీ గుత్తి వైపు నుంచి బళ్లారికి వెళ్తోంది. మద్యం మత్తులో ఉన్న లా రీ డ్రైవర్‌గుత్తి సమీపంలో ముందు వెళ్తున్న షిప్ట్ డీజైర్ వాహనానికి త గలించాడు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అనంతరం పాతకొత్తచెరువు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద డివైడర్‌ను ఢీకొటా ్టడు. దీంతో డీవైడర్ రాయి గుత్తి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్ద రు వ్యక్తులకు తగలడంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. డివైడర్‌ను బలంగా తగలడంతో లారీ టర్న్ తిరిగి రోడ్డుకు అడ్డంగా నిలచిపో యింది. స్ధానికుల సమాచారంతో రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్‌కు డంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిం చారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ బాలముని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....