Share News

COLLECTOR: వారంలోగా అసైన్డ భూముల జాబితా సిద్ధం కావాలి

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:42 PM

భూ సమస్యలతో మండ లంలోని రైతులు నిత్యం గ్రీవెన్సకు వస్తున్నారని, అసైన్డ భూముల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ అధికారుల ను ఆదేశించారు. మండలంలోని మరుట్ల మూడో కాలనీ సమీపంలో ఉన్న అసైన్డ భూములను ఆయన గురువారం పరిశీలించారు.

COLLECTOR: వారంలోగా అసైన్డ భూముల జాబితా సిద్ధం కావాలి
Collector Anand talking to farmers

- కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశం

కూడేరు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి) : భూ సమస్యలతో మండ లంలోని రైతులు నిత్యం గ్రీవెన్సకు వస్తున్నారని, అసైన్డ భూముల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ అధికారుల ను ఆదేశించారు. మండలంలోని మరుట్ల మూడో కాలనీ సమీపంలో ఉన్న అసైన్డ భూములను ఆయన గురువారం పరిశీలించారు. సాగు చేసిన భూములకు పట్టాలు ఇవ్వలేదని, ఆనలైనలో ఎక్కించలేదని, ఫిర్యాదులు వస్తున్న వాటిలో కూడేరు మండలానికి సంబంధించే అత్య ధికంగా ఉన్నాయని అధికారులతో కలెక్టర్‌ అన్నారు. ప్రస్తుతం నాలుగు రెవెన్యూ గ్రామాల్లో అసైన్ట కమిటీకి జాబితా సిద్ధం చేశామని రెవెన్యూ అధికారులు చెప్పగా, వారం రోజుల్లో జాబితా పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం అక్కడికి వచ్చిన రైతులతో భూ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు సాగు చేస్తున్న పండ్ల తోటలకు ప్రభుత్వం సబ్సీడీతో డ్రిప్‌ పరికరాలు అందిస్తోందని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రైతులకు తెలియజేశారు.


ఆయన వెంట ఆర్డీవో కేశవనాయుడు, తహసీల్దారు ఉదయ్‌భాస్కర్‌, ఎంపీడీవో కుళ్లాయిస్వామి, రీ సర్వే డీటీ దబ్బర ప్రసాద్‌, సర్వేయర్‌ ఆయేషా సిద్దికి, ఏఎస్‌ఐ రామానాయుడు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

వేతనాలు చెల్లించాలని కార్మికుల విన్నపం

తమకు తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వలేదంటూ శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు కలెక్టర్‌ వద్ద గోడును వినిపించారు. పీఏబీఆర్‌ డ్యాంలోని తాగునీటి పథకాలను పరిశీలించడానికి గురువారం వచ్చిన కలెక్టర్‌ను కార్మికులు కలిశారు. తొమ్మిది నెలలుగా వేతనాలు రాలేదని, 38 నెలల పీఎఫ్‌ సొమ్ము చెల్లించలేదని కలెక్టర్‌కు వివరించారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోడంతో కుటుంబపోషణ భారమైందని, అందుకే సమ్మెలో వెళ్లినట్లు కలెక్టర్‌కు వివరించారు. దీంతో స్పందించిన కలెక్టర్‌ జిల్లా పరిషత నిధులతో వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. వేతనాలు చెల్లించాకే విధుల్లో చేరుతామని కార్మికులు తెలిపారు. అదే సమయంలో ఆర్‌డబ్యూఎస్‌ ఈఈ శ్రీనివాసులు కార్మికుల విషయంలో జోక్యం చేసుకోవడంతో కార్మికులు ఈఈ తీరును నిరసించారు.

Updated Date - Apr 16 , 2026 | 11:42 PM