ROAD: ప్రయాణం నరకం
ABN , Publish Date - May 31 , 2026 | 12:54 AM
మండలకేంద్రం నుంచి ఆత్మకూ రు మండలంలోని సింగంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా మారింది. మంత్రి వర్యా మీరైనా పట్టించుకోండి అంటూ కూడేరు, సింగంపల్లి గ్రామాల ప్రజలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వేడుకుంటున్నారు.
- అధ్వానంగా కూడేరు - సింగంపల్లి రోడ్డు
కూడేరు, మే 30(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రం నుంచి ఆత్మకూ రు మండలంలోని సింగంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా మారింది. మంత్రి వర్యా మీరైనా పట్టించుకోండి అంటూ కూడేరు, సింగంపల్లి గ్రామాల ప్రజలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వేడుకుంటున్నారు. కూడేరు నుంచి ఆత్మకూరు మండలంలోని సింగంపల్లికి వెళ్లే రోడ్డు కొన్నేళ్లుగా మరమ్మతులు లేకపోవడంతో కంకర తేలి గుంతలు పడింది. ఆ రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టులు సైతం దెబ్బతిన్నారు. అయితే పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కొన్నేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు రోడ్డు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడున్నారు. పాలకులు మారతున్న రోడ్డు దుస్థితి మాత్రం అలాగే ఉందని ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కంకర తేలిన రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో వాహనదారులు కింద పడి తీవ్రగాయాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో రోడ్డుపై ప్రయాణించాలంటే నరకంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కూడేరు నుంచి సింగంపలికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తే ఆత్మకూరు మండకేంద్రానికి వెళ్లే దూరం కూడా తగ్గిపోతుంది.
ఆర్థిక శాఖ మంత్రి పైనే ఆశలు
కొన్ని సంవత్సరాలుగా దెబ్బతిన్న కూడేరు- సింగపల్లి రోడ్డుకు బాగుపడాలంటే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఉరవకొండ- రాప్తాడు నియోజక వర్గాల మధ్యనున్న ఈ రోడ్డు ను గత పాలకులు పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానంగా రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. కావున అధ్వానంగా మారిన కూడేరు - సింగంపల్లి రోడ్డు అభివృద్ధి పనులకు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కరుణించి నిధులు మంజూరు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....