Share News

MLA: అమరజీవి త్యాగం మరువలేనిది

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:00 AM

తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన సర్కిల్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

MLA: అమరజీవి త్యాగం మరువలేనిది
MLA Ashmita Reddy paying tributes at Tadipatri

- ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి

- ఘనంగా జయంతి వేడుకలు

(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్‌)

తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన సర్కిల్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన నాగ రాగిణి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సురేంద్రనాథ్‌ తదితరులు పాల్గొ న్నారు. అదేవిధంగా టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వా మి గుంతకల్లులోని పట్టణంలోని అమరజీవి విగ్రహానికి పూల మాలను వేసి నివాళులర్పించారు. అనంతరం పురపాలక సంఘ కార్యాలయంలో ఆయన మునిసిపల్‌ చైర్‌పర్సన ఎన భవాని, అధికారులు, కౌన్సిల్‌ సభ్యులుతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలను వేసి నివాళులర్పించారు. ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దారు రమాదేవి, కమి షనరు లక్ష్మిదేవి, టీడీపీ నాయకులు కేసీ హరి తదితరులు పాల్గొన్నా రు. గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఉన్న అమరజీవి విగ్రహానికి రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్‌, టీడీపీ పట్ట ణ కన్వీనర్‌ ఎంకే చౌదరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఉరవకొండలోని సీఎస్‌ఐ చర్చి సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి టీడీపీ నాయకులు, సామాజిక కార్యకర్తలు పూల మాలలు వేసి నివాళుల ర్పిం చారు. కళ్యాణదుర్గంలోని ప ట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు ఆదేశాల తో టీడీపీ నాయకులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూ లమాలలు వేసి ఘన నివాళు లు అర్పించారు. బొమ్మనహాళ్‌, కుందుర్పి, యాడికి తహసీ ల్దార్‌ కార్యాలయాల్లో అధికా రులు తదితరులు నివాళి అర్పించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 17 , 2026 | 12:00 AM