Share News

MLA: పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:21 AM

పేదలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆ మేరకు సీఎం చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. అందుకే వైసీపీ సానుభూతిపరులకు కూడా సీఎం సహాయ నిధి ని మంజూరు చేయిస్తున్నామని అన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం నియోజక వరం్గలోని 15 మందికి మంజూరైన రూ. 8,15,000 సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

MLA: పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం
MLA with those who received the cheques

- ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, జూన 27(ఆంధ్రజ్యోతి): పేదలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆ మేరకు సీఎం చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. అందుకే వైసీపీ సానుభూతిపరులకు కూడా సీఎం సహాయ నిధి ని మంజూరు చేయిస్తున్నామని అన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం నియోజక వరం్గలోని 15 మందికి మంజూరైన రూ. 8,15,000 సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో టీడీపీ సానుభూతి పరులకు ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి ఇవ్వలేదన్నారు. బాధితులని కూడా చూడకుండా రాజకీయ రంగును వేశారని విమర్శించారు.


కానీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధిని మంజూరు చేయిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అందుకే నేడు వైసీపీ సానుభూతిపరులు కూడా సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామని ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతు న్నారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నా రు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు సర్‌లో పాల్గొనండి

కళ్యాణదుర్గం: సర్‌ కార్యక్ర మంలో భాగంగా శనివారం పట ్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు అధికారులు ఓటరు ఫాంను అందజేశారు. ఆయన ఓటుకు సంబం ధిం చిన వివరాలను ఆ పత్రంలో నమోదు చేసి, ఆర్డీవో వసంతబాబు, ము న్సిపల్‌ కమిషనర్‌ వంశీ కృష్ణ భార్గవ్‌, తహసీల్దార్‌ భాస్కర్‌, బీఎల్‌వో లకు అందజేశారు. నియోజకవర్గంలోని ప్రతి బూతలో ఉన్న ఓటర్లు తమ వివరాలను బీఎల్‌వోలు అందించిన పత్రంలో నమోదు చేసి పారదర్శకమైన ఓటరు జాబితాకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 28 , 2026 | 12:21 AM