Share News

MLA: పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:44 PM

రాష్ట్రంలో పేదరికాన్ని పా రదోలడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటుప డుతున్నారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవా రం సాయంత్రం స్థానిక ఎస్‌ఎస్‌జీఎస్‌ డిగ్రీ కళాశాలలో మార్గదర్శి బంగారు కుటుంబం (ఎంబీకే) 10-20 వార్షికోత్సవ సమావేశాన్ని నిర్వ హించారు.

MLA: పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం
MLA presenting certificates of appreciation to the pioneers

: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

గుంతకల్లు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదరికాన్ని పా రదోలడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటుప డుతున్నారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవా రం సాయంత్రం స్థానిక ఎస్‌ఎస్‌జీఎస్‌ డిగ్రీ కళాశాలలో మార్గదర్శి బంగారు కుటుంబం (ఎంబీకే) 10-20 వార్షికోత్సవ సమావేశాన్ని నిర్వ హించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్‌ పార్టనర్‌షిప్‌ (పీ-4) కార్యక్రమంతో పేదరిక నిర్మూలనకు పకడ్బందీ పథకాన్ని రూపొందించిందన్నారు. నియోజకవర్గంలోని గ్రామ/వార్డు సచివాలయాలు 7,591 బంగారు కుటుంబాలను ఎంపికచేశారన్నారు. ఇప్పటికి 6,027కుటుంబాలను పరిశీలించి 2,368 కుటుంబాలను మార్గ దర్శకులు దత్తత తీసుకున్నారని, ఇంకా 1,564 కుటుంబాలను పరిశీలిం చాల్సి ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణం గా అందరూ శ్రమించి పీ-4 కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మార్గదర్శక9ఉలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దారు రమాదేవి, టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, ఎంపీపీ బీవీ మాధవి, మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన లక్ష్మిదేవి, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, పత్తి హిమబిందు, బీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 30 , 2026 | 11:44 PM