Share News

MLA: నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:47 PM

నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నివా సంలో ఆయన శనివారం చింతల వెంకట రమణస్వామి క్లస్టర్‌ అభివృద్ధి పథకం కింద 180మంది చేనేత కార్మికులకు రూ.49లక్షల విలువవై న పనిముట్లను పంపిణీ చేశారు.

MLA: నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
MLA distributing tools

-ఎమ్మెల్యే అశ్మితరెడ్డి

తాడిపత్రి, జూన 13(ఆంధ్రజ్యోతి): నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నివా సంలో ఆయన శనివారం చింతల వెంకట రమణస్వామి క్లస్టర్‌ అభివృద్ధి పథకం కింద 180మంది చేనేత కార్మికులకు రూ.49లక్షల విలువవై పనిముట్లను పంపిణీ చేశారు. గన్నెవారిపల్లికాలనీ, యర్రగుంటపల్లి, చిన్నపొలమడ, పెద్దపొలమడ, అక్కన్నపల్లి గ్రామాలకు చెందిన చేనేత లబ్ధిదారులకు ఈ పరికరాలు అంద జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత కళాకారులు కాలానుగుణంగా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. మగ్గం చీరల తయారీలో నాణ్యత పెంచి క్లస్టర్‌కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం అందజేసిన పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇవి చేనేత కార్మికుల శ్రమను తగ్గించి ఉత్పాదకతను పెంచడంతో పాటు ఎక్కువకాలం ఉపయోగపడేలా రూపొం దించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు, క్లస్టర్‌ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 13 , 2026 | 11:47 PM