Share News

TEMPLE : వైసీపీ వల్లే గందరగోళం

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:51 PM

గత వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే ప్రస్తుతం మండలంలోని నేమకల్లు ఆంజనేయస్వామి ఆ భరణాల విషయంలో గందరగోళం నెలకొందని ఆ ఆలయ పాల కమండలి చైర్మన శ్రీనాథ్‌ సోమవారం ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలతో నగల లెక్కలు సోమవారం తేలే అవకాశం ఉందని తెలిపారు.

TEMPLE : వైసీపీ వల్లే గందరగోళం
Chairman Srinath talking with the members of the governing body

- సోమవారం తేలనున్న ఆభరణాల లెక్కలు

- నేమకల్లు ఆలయ చైర్మన శ్రీనాథ్‌

బొమ్మనహాళ్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే ప్రస్తుతం మండలంలోని నేమకల్లు ఆంజనేయస్వామి ఆ భరణాల విషయంలో గందరగోళం నెలకొందని ఆ ఆలయ పాల కమండలి చైర్మన శ్రీనాథ్‌ సోమవారం ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలతో నగల లెక్కలు సోమవారం తేలే అవకాశం ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయల నిర్వహణ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో పాలక మండలు లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. అయితే గత ప్రభుత్వం లో ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూటమి ప్ర భుత్వం కొలువుదీరిన తర్వాత స్వామి వారికి వచ్చిన నగలు, అభర ణాలు పక్కగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తేలాల్సింది గత ప్ర భుత్వంలో నమోదైన నగలు, ఆభరణాల లెక్కలేనన్నారు. విలేకరుల సమావేశంలో పాలకమండలి సభ్యులు, గొల్ల హనుమంతరెడ్డి, అన్న దాన కమిటీ చైర్మన తిప్పేస్వామి, టీడీపీ నాయకులు గాలిబసప్ప. బెల్లి హనుమంతరెడ్డి, గాదిలింగ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 11 , 2026 | 11:51 PM