Share News

HOSPITAL: మారుతున్న ఆస్పత్రి రూపురేఖలు

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:01 AM

మండల కేంద్రంలోని ప్రభు త్వాస్పత్రి ఎన్నో యేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఆలయ ఆవరణంఓ ఎన్నో సంవత్సరాలుగా చెత్తాచెదారంతో నిండి ఉండేది. మండల కేంద్రం లోని ప్రధాన రహదారి గుండా పారీఏ వర్షపు నీరు ,మురుగునీరు ఆస్పత్రి ఆవరణలోకి చేరి అధ్వాన్నస్థితిలో వుండేది.

HOSPITAL: మారుతున్న ఆస్పత్రి రూపురేఖలు
A view of the government hospital premises being leveled with soil.

కుందుర్పి, జూన 13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రభు త్వాస్పత్రి ఎన్నో యేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఆలయ ఆవరణంఓ ఎన్నో సంవత్సరాలుగా చెత్తాచెదారంతో నిండి ఉండేది. మండల కేంద్రం లోని ప్రధాన రహదారి గుండా పారీఏ వర్షపు నీరు ,మురుగునీరు ఆస్పత్రి ఆవరణలోకి చేరి అధ్వాన్నస్థితిలో వుండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు కుందుర్పి ప్రభుత్వాప్పత్రి ని సందర్శించారు. ఇక్కడి అధ్వాన స్థితిని గమనించి, ఆస్పత్రి బాగోగులపైౖ ప్రత్యేక చొరవచూ పారు. ఆదర్శ ప్రభుత్వా స్పత్రిగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఆ మేరకు ఆస్పత్రి రూపు రేఖలు మార్చేలా చర్యలు చేపట్టారు. ఆస్పత్రి ఆవరణలోకి ఎర్రమట్టిని తరలించి, ఎక్స్‌కవేటర్‌లతో చదును చేస్తున్నారు. ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే సొంత నిధులతో రెండు రోజులుగా పను లు చేయిస్తున్నారు. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 14 , 2026 | 12:01 AM