Share News

MLA: అధికారులు నిర్లక్ష్యం వీడాలి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:54 PM

అధికారులు నిర్లక్ష్యం వీడి మంచి పరిపాలన అందించాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించా రు. పట్టణంలోని తమ నివాసంలో ఆయన మున్సిపల్‌, సచివాలయం తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

MLA: అధికారులు నిర్లక్ష్యం వీడాలి
MLA opening the road

-ఎమ్మెల్యే అశ్మితరెడ్డి

తాడిపత్రి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): అధికారులు నిర్లక్ష్యం వీడి మంచి పరిపాలన అందించాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించా రు. పట్టణంలోని తమ నివాసంలో ఆయన మున్సిపల్‌, సచివాలయం తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇ బ్బంది పడుతున్నారని, అలాంటి సమస్య నియోజకవర్గంలో ఎక్కడా ఉండరాదని హెచ్చరించారు. ముఖ్యంగా పలువురు ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని తమ దృష్టికి వచ్చిందన ్నారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే ఉద్యోగురు విధుల పట్ట నిర్లక్ష్యం వహించడం సహించరాని విషయమన్నారు. గ్రామాల్లోని ప్రతి వార్డును అధికారులు పరిశీలించి,


అక్కడి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

బీటీ రోడ్డు ప్రారంభం

పెద్దపప్పూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలంలో వెలసిన ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లే భక్తుల సౌక ర్యార్థం బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2.50కోట్లు మంజూరయ్యాయి. ఎ మ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆదేశంతో త్వరగా పనులు పూర్తయ్యాయి. దీంతో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన కట్‌ చేసి రోడ్డును ప్రారంభిం చారు. అనంతరం వారు దేవస్థానంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట టీడీపీ మండల కన్వీనర్‌ తాతిరెడ్డి లోకనాథ్‌రెడ్డి, నాయకులు బీసీ రామకృష్ణారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మీసాల నరసింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రఘునాథ్‌నాయుడు, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2026 | 11:54 PM