Share News

MLA: మరో 15 ఏళ్లు కూటమిదే అధికారం

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:08 AM

కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, మరో 15 ఏళ్ల పా టు కూటమి అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం అన్న దాత సుఖీభవ పథకాన్ని ఆర్డీవో వసంతబాబు, ఏడీఏ ఎల్లప్పతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

MLA: మరో 15 ఏళ్లు కూటమిదే అధికారం

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, జూన 20(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, మరో 15 ఏళ్ల పా టు కూటమి అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం అన్న దాత సుఖీభవ పథకాన్ని ఆర్డీవో వసంతబాబు, ఏడీఏ ఎల్లప్పతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతానికి జీవనాడైన బీటీపీ కాలువ పనులను అతి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రస్తావించారని, 2028 నాటికి కళ్యాణదుర్గంలోని 143 చెరువులకు నీ రందించడమే తమ ధ్యేయమన్నారు.


నియోజకవర్గంలో 50,595 మంది రైతుల ఖాతాల్లోకి రూ.34.93 కోట్లు అన్నదాత సుఖీభవ పథక సొమ్ము జమ చేశారని ఆయన పేర్కొన్నారు. కూటమి నాయకులు, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. అనం తరం ఎమ్మెల్యే ప్రజావేదికలో ప్రజాదర్బార్‌ నిర్వహించిన, ప్రజలన ఉం చి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. నియోజకవర్గంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని, వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

కళ్యాణదుర్గంరూరల్‌: శెట్టూరు మండలం ములకలేడు పంచా యతీ రంగయ్యపాళ్యం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు శనివారం తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. రంగయ్యపాళ్యానికి చెందిన నరసింహులు, శీనప్ప, రఘు, నాగరాజు, మనోజ్‌, శోభ, మహాదేవి, పుట్టిరమ్మ, రామలక్ష్మీ, గోపాల్‌, లోకేష్‌, మైత్రి, నరసింహులు, అఖిల్‌, భార్గవికి స్థానిక నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 21 , 2026 | 12:08 AM