MINISTER: స్థానిక ఎన్నికల్లో కూటమి గెలవాలి
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:23 PM
త్వరలో జరగబోయే స్ధానిక సంస్థల ఎన్నికలలో కూటమి అఽభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలి పించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న మంత్రి సవిత
గుత్తి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగబోయే స్ధానిక సంస్థల ఎన్నికలలో కూటమి అఽభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలి పించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పట్టణంలోని రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్ స్వగృహంలో ఆమె ఆదివారం పార్టీ స్ధానిక నాయకులు, కార్యకర్తలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. స్ధానిక ఎన్నికలలో అభ్యర్థులను గెలపించి మండల పరిషతను కైవసం చేసుకోవాలన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదించడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....