Share News

M LA: రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - May 14 , 2026 | 12:09 AM

రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే, పరిష్కరిస్తానని ఎమ్మె ల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. మండలంలో ని తబ్జుల, కొత్తపల్లి గ్రామాల్లో ఆయన బు ధవారం పర్యటించారు. తబ్జుల గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు.

M LA: రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
MLA opening secretariat in Tabjula village

ఎమ్మెల్యే అశ్మితరెడ్డి

పెద్దపప్పూరు, మే 13(ఆంధ్రజ్యోతి): రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే, పరిష్కరిస్తానని ఎమ్మె ల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. మండలంలో ని తబ్జుల, కొత్తపల్లి గ్రామాల్లో ఆయన బు ధవారం పర్యటించారు. తబ్జుల గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప ర్యటించి ప్రజల సమస్యలు, అధికారుల ప నితీరు గురించి గ్రామస్థులను అడిగి తెలు సుకున్నారు. అనంతరం మండలంలోని కొత్తపల్లిలో పర్యటించి, గ్రామస్తులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఆయన వెంట టీడీపీ మండల కన్వీనర్‌ తాతిరెడ్డి లోకనాథ్‌రెడ్డి, శశి ధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి విజయ్‌కుమార్‌, వెంకట నారాయణరెడ్డి, తహసీల్దార్‌ బాలాజీరాజు, ఎస్‌ఐ చంద్ర శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో రత్నాబా యి తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

తాడిపత్రి: నియోజ కవర్గంలోని 19 కుటుంబాలకు మంజూరైన రూ. 19,03,585 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి బుధవారం పంపిణీ చేశారు. పట్టణంలోని తన నివాసం లో లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలో 545మందికి రూ. 4,13,47,361 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 14 , 2026 | 12:09 AM