Share News

APTF: ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:23 PM

ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలనే డిమాండ్‌తో పాటు ఉపాధ్యాయులు ఇతర సమస్యలపై శుక్రవారం సాయంత్రం ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో స్ధానిక తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటుంన్న సమ స్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.

APTF: ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలి
APTF leaders giving petition to Tehsildar in Gutti

- ఏపీటీఎఫ్‌ నాయకులు

గుత్తి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలనే డిమాండ్‌తో పాటు ఉపాధ్యాయులు ఇతర సమస్యలపై శుక్రవారం సాయంత్రం ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో స్ధానిక తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటుంన్న సమ స్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ పుణ్యవతికి అందజేశారు. ఏపీటీ ఎఫ్‌ మండల అఽధ్యక్షుడు మస్తాన, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ నాయుడు, గుంతకల్లు,గుత్తి, పెద్దవడుగూరు మండలా ల నాయకులు చంద్రశేఖర్‌, దేశాయ్‌ నాగరాజు, మాధవి, శేషఫణి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఉరవకొండ: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ప ట్టణంలో ఆ యూనియన ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై డీటీ భోగన గౌడ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు భువనేశ్వర్‌ చౌదరి, ఓబన్న, పాండు, లోకేష్‌, వేణుగోపాల్‌, నజీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 27 , 2026 | 11:23 PM