Share News

OPS: ఓపీఎస్‌ అమలుపై ఉపాధ్యాయుల హర్షం

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:06 AM

2003 డీఎస్సీ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వ ఓపీఎస్‌ను అమలు చేయడంతో డీఎస్సీ ఉపాధ్యాయ పోరం నా యకులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాల యం వద్ద నుంచి లక్ష్మీబజార్‌, పాతబస్టాండ్‌, వినాయకసర్కిల్‌ వర కు సీఎం సార్‌ థ్యాంక్యూ అంటూ నినాదాలు చేస్తూ బుధవారం ర్యా లీ నిర్వహించారు.

OPS: ఓపీఎస్‌ అమలుపై ఉపాధ్యాయుల హర్షం

రాయదుర్గం రూరల్‌, జూన 24(ఆంధ్రజ్యోతి): 2003 డీఎస్సీ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వ ఓపీఎస్‌ను అమలు చేయడంతో డీఎస్సీ ఉపాధ్యాయ పోరం నా యకులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాల యం వద్ద నుంచి లక్ష్మీబజార్‌, పాతబస్టాండ్‌, వినాయకసర్కిల్‌ వర కు సీఎం సార్‌ థ్యాంక్యూ అంటూ నినాదాలు చేస్తూ బుధవారం ర్యా లీ నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు చిత్రప టానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞ తలు తెలిపారు. డీఎస్సీ ఉపాధ్యాయ పోరం జిల్లా కన్వీనర్లు మా రుతివరప్రసాద్‌, కట్టయ్య, సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, రామాంజినేయులు, రామచంద్ర, హేమలత, సక్రప్ప, గుమ్మఘట్ట, డీ.హీరేహాళ్‌ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 25 , 2026 | 12:06 AM