TEACHERS: ఉపాధ్యాయులకు సర్ విధులు వద్దు
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:54 PM
పట్టణం, అర్బన పరిధి లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సర్ విధులు కేటాయిస్తూ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీఎనయూఎస్, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. వారు మం గళవారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈఓ మస్తానరావుకు వినతి పత్రం అందజేశారు.
- ఉపాధ్యాయ సంఘాల వినతి
గుంతకల్లు టౌన, జూలై 7(ఆంధ్రజ్యోతి): పట్టణం, అర్బన పరిధి లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సర్ విధులు కేటాయిస్తూ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీఎనయూఎస్, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. వారు మం గళవారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈఓ మస్తానరావుకు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయులు ఇప్పటికే పాఠశాలలో బోధన, బోధనేతర పనులు చేస్తున్నారన్నారు. పాఠశాల సమయం తర్వాత పదో తరగతి వి ద్యార్థులకు తరగతులు ఉంటాయని, వాటితో పాటుసర్ నిధు లు నిర్వహిం చడం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సంఘాల నాయకులు రాఘవేంద్ర, సత్య, బాబా పాల్గొన్నారు.
అంగనవాడీల వినతి
తాడిపత్రి: అంగనవాడీ సిబ్బందికి బూతలెవల్ ఆఫీసర్ విధులను అప్పగించడాన్ని నిలిపివేయాలని ఏఐటీయూసీ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతిలత, ప్రాజెక్ట్ కార్యదర్శి శంకరమ్మ, నాయకురాలు హైమావతి అధికారులను కోరారు. స్థానిక సీడీపీవో కార్యాలయంలో మంగళవారం సీడీపీవో అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అం గనవాడీ కార్యకర్తలు ఇప్పటికే అనేక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని, మళ్లీ బీఎల్‌వో విధులను అప్పగించడం అన్యాయమన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....