MLA: ఇంటింటికి టీడీపీ 70 శాతం పూర్తి
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:42 PM
ఇంటింటికి టీడీపీ కా ర్యక్రమంలో పార్టీ నాయకులు ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 70 శాతం ఇళ్లను సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు.
- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఇంటింటికి టీడీపీ కా ర్యక్రమంలో పార్టీ నాయకులు ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 70 శాతం ఇళ్లను సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్య క్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని పదో వార్డులో ఎమ్మెల్యే కాలవ పర్యటించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
పట్టణాభివృద్ధికి రూ. 25 కోట్ల ప్రత్యేక నిధులు
రాయదుర్గం: పట్టణ రహదారులు, పార్కుల అభివృద్ధికి మరో రూ. 25 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే కాలవ శ్రీని వాసులు తెలిపారు. కణేకల్లు రోడ్డులో రూ. 7.50 లక్షలతో నిర్మించబోయే సీసీరోడ్ పనికి ఆయన బుధవారం భూమిపూజ చేశారు. పట్టణంలో ఇప్పటికే సుమారు రూ. 13 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసి నట్లు వివరించారు. రహదారులు, పార్కుల అభివృద్ధికి మరో రూ. 25 కోట్లు మంజూరు కానున్నాయని అదనంగా మరో రూ. ఐదు కోట్లు కేటా యించేందుకు మంత్రి నారాయణ అంగీకరించారని వెల్లడించారు. అలా గే పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ. 78 కోట్లతో నీటి సరఫరా వ్యవస్థ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.