Share News

MLA: సంక్షేమం, అభివృద్ధి అంటే టీడీపీ

ABN , Publish Date - May 27 , 2026 | 11:52 PM

ప్రజా సంక్షేమం అంటే ఏంటో దేశానికి చాటిచెప్పిన మహనీయుడు టీడీపీ వ్యవస్థాపకు డైన ఎన్టీ రామారావు అని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. వర్చ్యువల్‌ విధానంలో మహానాడు వేడుకలను నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

MLA: సంక్షేమం, అభివృద్ధి అంటే టీడీపీ
MLA and others watching live telecast in Guntakallu

- ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

గుంతకల్లు/ ఉరవకొండ, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం అంటే ఏంటో దేశానికి చాటిచెప్పిన మహనీయుడు టీడీపీ వ్యవస్థాపకు డైన ఎన్టీ రామారావు అని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. వర్చ్యువల్‌ విధానంలో మహానాడు వేడుకలను నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని కసాపురం లో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ పేరిట ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. అనంతరం కసాపురం, నాగస ముద్రం, తదితర గ్రామాలలో, పట్టణంలోని పలుచోట్ల జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని, పార్టీ జెండా ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమానికి, అభి వృద్ధికి మారుపేరుగా టీడీపీ దూసుకెళ్తోందని పేర్కొన్నారు. జగన రాషా్ట్ర న్ని అధోగతి పట్టించగా, చంద్రబాబు రాషా్ట్రనికి భవిష్యత్తుగా మారార న్నారు. అలాగే ఉరవకొండ పట్టణంతో పాటు నియో జకవర్గంలో నూ తెలుగు తమ్ముళ్లు క్లస్టర్ల వారీగా మహానాడు వేడుకలను నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 27 , 2026 | 11:52 PM