Share News

STUDENTS: ఎస్‌ఎస్‌జీఎస్‌ డిగ్రీ విద్యార్థుల ప్రతిభ

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:07 AM

పట్టణంలోని శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌లో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపా రు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంగళవారం కళాశాలలో అభి నందించారు.

STUDENTS:  ఎస్‌ఎస్‌జీఎస్‌ డిగ్రీ విద్యార్థుల ప్రతిభ
Principal and teachers congratulating the students

గుంతకల్లుటౌన, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌లో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపా రు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంగళవారం కళాశాలలో అభి నందించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఈనెల 5న మై సూర్‌లోని సెయింట్‌ ఫిలోమినాస్‌ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్ధాయి ఫెస్ట్‌లో తమ కళాశాలలో చదువుతున్న మేనేజ్‌మెంట్‌ విద్యా ర్థులు పాల్గొన్నట్లు తెలిపారు. మార్కెటింగ్‌ ఈవెంట్‌లో ప్రతిభ కనబరచి నగదు బహుమతి పొందారన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆధ్యాపకులు వరప్రసాద్‌, సుభాషిణి, శ్రావణి అభినందించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 11 , 2026 | 12:07 AM