COLLEGE: జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ప్రతిభ
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:54 PM
పట్టణంలోని ఎస్కేపీ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి పర్యావరణ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య బుధవారం తెలిపారు. కేంద్రప్రభుత్వం ఆనలైనలో జాతీయ స్థాయిలో పర్యా వరణపై క్విజ్ పోటీలను బుధవారం నిర్వహించిందన్నారు.
గుంతకల్లు టౌన, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎస్కేపీ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి పర్యావరణ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య బుధవారం తెలిపారు. కేంద్రప్రభుత్వం ఆనలైనలో జాతీయ స్థాయిలో పర్యా వరణపై క్విజ్ పోటీలను బుధవారం నిర్వహించిందన్నారు. తమ కళాశాలకు చెందిన ఏడుగురు ఎనఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొని ప్రతిభ కనబరిచారన్నారు. వారికి బంగారు, కాంస్య బ్యాడ్జీలు కలిగిన ప్రశంస పత్రాలను అందజేశామన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, ఎనఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు నారాయణ, రవిశంకర్, వైస్ ప్రిన్సిపాల్ రవిశంకర్ శర్మ, ఆధ్యాపకులు హనుమంత రెడ్డి, పవనకుమార్ అభినందించారు.